37.2 C
India
Tuesday, May 7, 2024
More

    Missing husband : తప్పిపోయిన భర్త దొరికాడనుకొని.. అంతలోనే ఆనందం ఆవిరి

    Date:

    Missing husband
    sad wife 

    Missing husband తనను ఇష్టంగా చూసుకునే భర్త, పదేళ్ల క్రితం దేశం కాని దేశంలో తప్పిపోయాడు. అతడి కోసం ఆ భార్య పడిన ఆరాటం మాములు విషయం కాదు. కానీ ఆ దేవుడు ఇప్పటికీ ఆ ఆడబిడ్డకు న్యాయం చేయలేదు. తన భర్త దొరికాడనుకొని ఇంటికి తెచ్చుకున్న మతిస్థిమితం లేని వ్యక్తి మరెవరో అని తెలిసి, ఆ మహిళ కన్నీటి రోదన ఎంతో మందిని కంటతడి పెట్టించింది.

    ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లాలో మతిస్థిమితం లేని వ్యక్తిని పదేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తగా భావించి ఇంటికి తీసుకొచ్చింది ఓ ఇల్లాలు.  చివరకు తన భర్త కాదని కనిపెట్టి బాధ పడింది. యూపీలోని బలియా జిల్లాలో దేవ్ కలి గ్రామానికి చెందిన మోతీచంద్ వర్మకు 21 ఏండ్ల క్రితం జానకీదేవితో వివాహమైంది. వీరికి ముగ్గురు కొడుకులు. పెండ్లయిన కొన్నాళ్లకు మోతీచంద్ మానసిక పరిస్థితి క్షీణించింది. వైద్యం కోసం బంధువులతో కలిసి నేపాల్ కు వెళ్లింది. అక్కడే మోతీ చంద్ తప్పిపోయాడు. భర్త కోసం జానకీ దేవి చేయని ప్రయత్నం లేదు. దేశం కాని దేశంలో కాళ్లరిగేలా తిరిగింది. కలిసిన వాళ్లందరినీ అడిగింది. కాళ్లావేళ్లా పడింది. అధికారులను వేడుకుంది. తన భర్త అచూకీ కనిపెట్టాలని ఎందరినో వేడుకుంది. దేవుడికి ఎన్నో ప్రార్థనలు చేసింది.

    అయితే ఈ క్రమంలో శనివారం ఒక వ్యక్తి బలియా జిల్లా దవాఖాన వద్ద మతిస్థిమితం లేకుండా కనిపించాడు. దగ్గరికి వెళ్లి పరిశీలిస్తే తన భర్తలాగే కనిపించాడు. పాత దుస్తులు, పూర్తి గడ్డంతో ఉన్న వ్యక్తిని మోతీచంద్ గా భావించింది. వెంటనే తనతో కలిసి ఇంటికి తీసుకెళ్లింది. పిల్లలకు చూపించింది. కానీ మోతీ చంద్ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి పుట్టమచ్చలు పరిశీలించగా, మోతీ చంద్ కాదని తెలిసిపోయింది. తన భర్త దొరికాడని పడిన ఆనందం నాలుగు గంటలైన ఆ మహిళకు మిగల్లేదు. ఇక వ్యక్తికి క్షమాపణలు చెప్పి ఇంటి నుంచి పంపించింది. తన భర్త కోసం  ఆ తల్లి ఆరాటం చూసిన వారంతా దేవుడు కరుణిస్తు బాగుండని అనుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Married Life : కాపురం ఎలా చేయాలో తెలుసా?

    Married Life : కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే...

    Superiority of Women Survival : స్త్రీ ఔన్నత్యాన్ని తెలుసుకుంటేనే మనుగడ..!

    Superiority of Women Survival : స్త్రీలు ఎక్కడ పూజింప పడతారో...

    High Court: ఆ విషయంలో ఒత్తిడి చేస్తే క్రూరత్వమే: ఢిల్లీ హైకోర్టు

    High Court: ప్రపంచం వేరు ఇండియా వేరు. ప్రపంచంలో ఒక భాగమైనా...

    Good partner : మంచి భాగస్వామి కావాలంటే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

    Good partner : కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే...