34 C
India
Tuesday, May 7, 2024
More

    Donald Trump : ట్రంప్ ఇక పోటీ చేయలేడా..? కొలరాడో సుప్రీకోర్టు తీర్పులో ఏముంది?

    Date:

    Donald Trump
    Donald Trump

    Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నకు గట్టి షాకే తగిలింది. తనను గతంలో అధికారంలోకి తెచ్చిన పార్టీ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు అనర్హుడంటూ కొలరాడో సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. దీంతో రిపబ్లికన్ ప్రైవమరీ ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేకుండా ఆయనపై అనర్హత వేటు పడింది. వైట్ హౌజ్ కు రెండో సారి వెళ్లాలనుకున్న ఆయన ఆశలకు బ్రేక్  పడింది. 2021 లో జరిగిన క్యాపిటల్ భవనంపై దాడికి సబంధించిన కేసులో సుప్రీం కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అయితే, అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతపై అనర్హత వేటుపడడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలి సారి కావడం గమనార్హం.

    2021లో జరిగిన క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిందని, దీన్ని ప్రేరేపించింది ట్రంప్ అని కోర్టు తెలిపింది. ఈ కేసులో బలమైన సాక్షాధారాలు ఉన్నాయి పేర్కొంది. ఈ కారణంగా అమెరికా రాజ్యాంగంలోని సవరణ 14, సెక్షన్ 3 ప్రకారం ఆయన ప్రైమరీ ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు కోర్టు తెలిపింది. న్యాయస్థానం 4-3 మెజారిటీతో ఈ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ యూఎస్ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కోర్టు కల్పించింది. ఇందుకు గానూ 2024, జనవరి 4వ తేదీ వరకు ఉత్తర్వుల అమలును నిలిపేస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాజకీయ భవితవ్యాన్ని అమెరికా సుప్రీం కోర్టు తేల్చనుంది.

    ఈ కేసు గతంలో కొలరాడోలోని డిస్ట్రిక్ట్ కోర్టు కూడా విచారణ జరగగా సుప్రీం కోర్టు తీర్పునకు భిన్నంగా డిస్ట్రిక్ట్ కోర్ట్ స్పందించింది. ఈ ఘటన ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు నిషేధించాల్సిన అవసరంలేదని పేర్కొంది. అయితే, డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును కొలరాడో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ప్రైమరీలో పోటీ చేసేందుకు అనర్హుడని చెప్పింది.

    సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో అధ్యక్ష అభ్యర్థిత్వానికి కొలరాడోలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల నుంచి ట్రాంప్ ను తొలగించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే వచ్చే ఏడాది మార్చి 5వ తేదీ జరిగే రిపబ్లిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేరు. ఇక నవంబర్ 5వ తేదీ జరగనున్న యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థిత్వంపై ఈ సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో ట్రంప్ యూఎస్ సుప్రీం కోర్టులో సవాల్ చేస్తారని తెలిసింది.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి.. సెంచరీతో మెరిసిన సూర్య

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ మధ్య...

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో...

    ATA Sayyandi Padam : ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటా ‘సయ్యంది పాదం’

    ATA Sayyandi Padam :  వచ్చే నెల (జూన్) 7వ తేదీ...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...