
lady finger : మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. డయాబెటిస్ క్యాపిటల్ గా ఇండియా నిలుస్తోంది. అందులో తెలుగు రాష్ట్రాల పాత్ర కూడా ఉంది. దీంతో షుగర్ ను నియంత్రించుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆహారం విషయంలో, వ్యాయామం చేస్తూ నిత్యం ఒక పోరాటం చేస్తున్నారు. అయినా వ్యాధి తగ్గడం లేదు. ఫలితంగా ఇంకా ముప్పు పెరుగుతూనే ఉంది.
డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆహార అలవాట్లు కూడా మార్చుకుంటున్నారు. ఇందులో తాజా కూరగాయలు తినేందుకు మొగ్గు చూపుతున్నారు. షుగర్ కు బెండకాయ మంచి మందులా ఉపయోగపడుతుంది. రాత్రి పూట రెండు బెండకాయలను రెండు గా చేసి నీళ్లలో నానబెట్టి ఉదయం తీసుకుంటే షుగర్ కంట్రోల్ లోకి వస్తుందని చెబుతున్నారు.
బెండకాయలో ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నిషియం, పాస్పరస్, పొటాషియం, జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి1, బి2, బి3, విటమిన్ సి, ఇ, కె వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లకు ఇది మంచి ఆహారమే. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.
బెండకాయలో ప్రొటీన్లు అధికంగా ఉన్నందున షుగర్ పేషెంట్లు తరచుగా తీసుకోవాలి. బరువును నియంత్రణలో ఉంచుతాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచడంలో సాయపడుతుంది. రోజు ఆహారంలో దీన్ని భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.