
Benefits of mangoes : మామిడి పండు ఫలాల్లో రారాజు. దాని ఆకర్షణీయమైన రంగుతో ఎంతో బలాన్నిస్తుంది. మామిడిపండుతో మనకు ఎన్నో పోషకాలు అందుతాయి. సీజనల్ గా దొరికే పండు కావడంతో దీన్ని తినేందుకు అందరు ఇస్టపడుతుంటారు. తియ్యగా ఉండే పండ్లలో ఇది ముఖ్యమైనది. దీంతో పచ్చళ్లు కూడా పెడతారు. మామిడి ఊరగాయ అంటే అందరికి ఎంతో ప్రీతి.
తెలుగు వారికి ఆవకాయ అంటే భలే పసందు. ఎండాకాలం వచ్చిందంటే చాలు మామిడి కాయ పచ్చడి పెట్టుకోవడం ఆనవాయితీ. ఏ ఇంట్లో అయినా మామిడి పచ్చడి కనిపించడం సాధారణమే. ఈ నేపథ్యంలో మామిడి తినడం ఎంతో ఉత్తమం. మామిడి పండు తినే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లలో నానబెట్టిన తరువాత తినేందుకు మొగ్గు చూపాలి.
మామిడి పండు తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెంచుతుంది. దీంతో సంసార సుఖం పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో మన ఆరోగ్యం మెరుగు పడుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఇలా మామిడిపండుతో మనకు ఒనగూరే ప్రయోజనాలెన్నో ఉన్నాయి. ఈ క్రమంలో మామిడి పండు తినడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది.
మామిడిలో విటమిన్ ఎ,సి ఉంటాయి. దీంతో చర్మం బిగుతుగా మారుతుంది. చర్మం నిగనిగలాడుతుంది. ముసలితనం కనిపించదు. ఇందులో ఉండే కొలాజెన్ ఉండటంతో లాభాలుంటాయి. మామిడి వల్ల మనకు పలు రకాల మేలు కలుగుతుంది. సీజన్ లో దొరికే పండ్లతో పలు రకాల ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. దీంతో వీటిని తినడం వల్ల మనకు ఉపశమనం కలుగుతుంది.