
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంగా పేరు గాంచింది యునైటెడ్ కింగ్ డమ్. భారతీయులను బానిసలుగా చేసుకొని సుదీర్ఘ కాలం పరిపాలించడమే కాకుండా మన దేశ సంపద కొల్లగొట్టిన దేశం బ్రిటన్. అలాంటి బ్రిటన్ కు కేవలం 75 సంవత్సరాలలోనే భారత్ తిరుగులేని సమాధానం చెప్పింది బ్రిటన్ కు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటూ విర్రవీగిన ఆంగ్లేయులకు ఇప్పుడు ఓ భారతీయుడు ప్రధాని అవుతున్నాడు. ఇది కదా విధి విచిత్రం అంటే ……..
భారత సంతతికి చెందిన రిషి సునాక్ తిరుగులేని మెజారిటీతో ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈనెల 28 న బ్రిటన్ కొత్త ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత పలువురు ప్రధాని పదవికి పోటీ పడగా తొలుత రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. అయితే రిషి సునాక్ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో బోరిస్ జాన్సన్ లిజ్ ట్రస్ ఎన్నికయ్యేలా పావులు కదిపారు. దాంతో లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని అయ్యింది కానీ పట్టుమని 45 రోజులు కూడా బాధ్యతలు నిర్వహించ కుండానే రాజీనామా చేయాల్సి వచ్చింది.
బ్రిటన్ లో ఇప్పుడు రాజకీయ సంక్షోభం మాత్రమే కాదు ఆర్ధిక సంక్షోభం కూడా నెలకొంది. దాంతో ఆ దేశాన్ని గాడిలో పెట్టడానికి ఇప్పుడు ఓ భారతీయుడు కావాల్సి వచ్చింది. నిజంగా ఇదొక అద్భుతం అనే చెప్పాలి. మనల్ని బానిసలుగా చేసుకొని పరిపాలించిన వాళ్ళను ఆదుకోవడానికి …… మనపై అధికారం చెలాయించిన వాళ్లపై అధికారం చేపట్టే అవకాశం లభించడం అంటే కాల మహిమ అంటే ఇదే కదా …… అంటూ ప్రతీ భారతీయుడు గల్లా ఎగుర వేస్తున్నారు.