బాలయ్యకు జగన్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది దాంతో ఒంగోలులోని కాలేజ్ గ్రౌండ్స్ లో జరగాల్సిన వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో చోటుకు మారింది. ఈనెల 6 న వీరసింహా రెడ్డి చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఒంగోలులో భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో చేయడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసారు. అయితే పనులు ప్రారంభం అయ్యాక అధికారులు ఆ వేడుకకు అనుమతి నిరాకరించారు.
దాంతో షాక్ అయిన చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలనుకుంది. అయితే కాలేజ్ గ్రౌండ్స్ లో కాకుండా ఒంగోలులోనే మరో చోట చేసుకోవాలని అధికారులు సూచించడంతో” అర్జున్ ఇన్ఫ్రా ” కు వీరసింహా రెడ్డి వేదిక మారింది. దాంతో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” వీరసింహా రెడ్డి ”. జనవరి 12 న భారీ ఎత్తున విడుదల అవుతున్న ఈ చిత్రం కోసం ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు. ఒంగోలు దర్శకులు గోపీచంద్ మలినేని సొంత జిల్లా కావడంతో అక్కడ ప్లాన్ చేసారు. అయితే ముందుగా అనుకున్న చోట కాకుండా మరో చోట చేసుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో వేదిక మారింది. ఈ విషయం పట్ల హీరో బాలకృష్ణ చాలా ఆగ్రహంగా ఉన్నాడట.