Horoscope మేష రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితం ఉంటుంది. ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చవడం మంచిది.వృషభ రాశి వారికి విజయం దక్కుతుంది. పనుల్లో ఉత్సాహం ఉంటుంది. బంధువులతో సంతోషంగా ఉంటారు. సూర్యాష్టకం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.మిథున రాశి వారికి మంచి కాలం. భవిష్యత్ పై ప్రణాళిక వేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల మంచి జరుగుతుంది.
కర్కాటక రాశి వారికి పనుల్లో వేగం పెరుగుతుంది. మనోధైర్యం కలుగుతుంది. మిత్రుల సహకారం ఉంటుంది. దుర్గామాత దర్శనం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విష్ణు సహస్ర నామాలు చదవడం వల్ల శుభాలు కలుగుతాయి.
కన్య రాశి వారికి మంచి కాలం. మంచి ఆలోచనలు ఉపయోగపడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
తుల రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలుంటాయి. ఒత్తిడి తగ్గి భవిష్యత్ పై ఆలోచిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శ్రేయస్కరం.
వృశ్చిక రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆచితూచి ఆలోచించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.
ధనస్సు రాశి వారికి పనుల్లో విజయాలు దక్కుతాయి. మనోబలం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. శని ధ్యాన శ్లోకం చేయడం మంచిది.
మకర రాశి వారికి విజయాలు లభిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. మనోధైర్యం కలుగుతుంది. విష్ణువు పూజిస్తే మంచి లాభాలు ఉన్నాయి.
కుంభ రాశి వారికి విజయం కోసం కష్టపడాలి. శుభకార్యాలపై దృష్టి పెడతారు. ధన వ్యయంపై జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీగణపతిని ఆరాధించడం వల్ల శుభాలు కలుగుతాయి.
మీన రాశి వారికి ధైర్యంతో ముందడుగు వేస్తారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. శ్రీరామ నామం జపిస్తే మంచిది.
ReplyForward
|