
మరి గత కొంత కాలంగా బ్రహ్మానందం గారు ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన నటించిన చివరి సినిమా రంగమార్తాండ.. దీని తర్వాత మరో సినిమాలో కనిపించలేదు.. ఇదిలా ఉండగా బ్రహ్మానందంతో టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. అలాంటి కాంబోలో త్రివిక్రమ్ – బ్రహ్మానందం కాంబో ఒకటి..
ఈయన సినిమాల్లో బ్రహ్మానందం కోసం సృష్టించిన పాత్రలు, కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ముఖ్యంగా త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చిన అతడు సినిమాలో ఈయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే త్రివిక్రమ్ ఈ మధ్య చేసి అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత సినిమాల్లో ఈయన కనిపించలేదు. ఈ కాంబో మళ్ళీ చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
తాజాగా త్రివిక్రమ్ మహేష్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాలో బ్రహ్మానందం కనిపిస్తారు అనే టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ బ్రహ్మానందం కోసం పాత్ర రాయగా కొన్ని మార్పులు చేసి ఈయన కోసం స్పెషల్ రోల్ క్రియేట్ చేసి రాయాలని మహేష్ కోరారట.. దీంతో త్రివిక్రమ్ కూడా అదే పనిలో ఉన్నారని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని టాక్.. మొత్తానికి మరోసారి బ్రహ్మానందం గారి కామెడీ చూడబోతున్నాం..
ReplyForward
|