
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడానికి నేను సిద్ధమని ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కట్ చేస్తే 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. అలీ స్థాయి ఏంటి ? ఆ మాటలు ఏంటి ? పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసేంత దమ్ము ఉందా ? స్థాయి చూసుకొని మాట్లాడాలి కదా ! అంటూ అలీ వ్యాఖ్యలను కొట్టి పడేసాడు.
తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు 30 ఇయర్స్ పృథ్వీ. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చిన పృథ్వీ అలీ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాడు. పవన్ కళ్యాణ్ దగ్గర బ్లాక్ మనీ లేదని , ఆయన ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్ కోసం 9 కోట్లు అప్పు చేసాడని , పవన్ కళ్యాణ్ ప్రజల కోసం వచ్చిన మనిషని ఆయన మీద విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నాడు.
30 ఇయర్స్ పృథ్వీ గతంలో వైసీపీ లో ఉండేవాడు. జగన్ వెంట నడిచాడు …… ఆ సమయంలో అమరావతి రైతులను అలాగే ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో విమర్శించాడు. కట్ చేస్తే ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ పదవి అలంకరించాడు. కట్ చేస్తే ఆరు నెలలు కూడా కాకముందే వివాదంలో ఇరుక్కున్నాడు. దాంతో ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉండి ఇటీవలే జనసేన పార్టీలో చేరాడు.