
నటసింహం నందమూరి బాలకృష్ణ కాచిగూడ లోని తారకరామ థియేటర్ ను ప్రారంభించాడు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు ఈ థియేటర్ ను నిర్మించిన విషయం తెలిసిందే. రాజీవ్ గాంధీ హత్య అనంతరం కాచిగూడ లోని తారకరామ థియేటర్ ను ధ్వంసం చేసారు కాంగ్రెస్ శ్రేణులు అప్పట్లో. దాంతో కొన్నాళ్ళు ఆ థియేటర్ మూతబడింది.
ఆ తర్వాత తారకరామ థియేటర్ ను బాగు చేయించి పాత సినిమాలను ప్రదర్శించేవారు. మెల్లి మెల్లిగా కేవలం అడల్ట్ చిత్రాలను మాత్రమే ఆ సినిమా థియేటర్ లో ప్రదర్శించేవారు. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేవి. కాచిగూడ విపరీతమైన రద్దీ ఏరియా కావడంతో ఏషియన్ వాళ్లతో కలిసి తారకరామ థియేటర్ ను రెనోవేట్ చేసారు.
ఇటీవల కాలంలో ఏషియన్ వాళ్ళు పలు పాత థియేటర్ లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు …… అలాగే కొత్త కొత్త సినిమాలను ప్రదర్శిస్తున్నారు. అదే బాటలో తారకరామను బాగు చేసారు. ఇక ఇప్పుడు దీని పేరు ”ఏషియన్ తారకరామ ” గా మార్చారు. ఇక నుండి అన్నీ కొత్త సినిమాలు వేయనున్నారట. ఈరోజు డిసెంబర్ 14 న నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ థియేటర్ ను ప్రారంభించారు. అంటే ఇక మళ్ళీ తారకరామ థియేటర్ కు స్వర్ణయుగం అన్నమాట. ఒకప్పుడు ఈ థియేటర్ లో కొత్త సినిమాలే విడుదల అయ్యేవి మరి.