కె. విశ్వనాథ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు నందమూరి బాలకృష్ణ. భారతీయ సంస్కృతీ , సాంప్రదాయాలను అందునా తెలుగు దనాన్ని దశదిశలా వ్యాపింప జేసేలా చేసిన మహనీయుడు విశ్వనాథ్ అంటూ ఆయన కళామతల్లికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు బాలయ్య. తెలుగుజాతి గర్వించ తగ్గ సినిమాలను అందించిన ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించాడు బాలయ్య.
బాలయ్య హీరోగా విశ్వనాథ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించాడు. ఆ సినిమా జననీ జన్మభూమి. అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు కానీ బాలయ్య హీరోగా నటించిన పలు సూపర్ హిట్ చిత్రాల్లో విశ్వనాథ్ నటించాడు. బాలయ్య హీరోగా నటించిన చిత్రాల్లో విశ్వనాథ్ కు నటుడిగా కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చాయి ఆ చిత్రాలు. నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహా , సీమ సింహం తదితర చిత్రాల్లో బాలయ్య తండ్రిగా విశ్వనాథ్ నటించాడు.