
నరేష్ – పవిత్ర లోకేష్ ల పెళ్లి కానివ్వను అంటూ సవాల్ చేస్తోంది నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి. నరేష్ మంచివాడు కాదని , నాకు కృష్ణ కు అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేసాడని , కోర్టులో అలాగే చెప్పాడని అతడి నీచ బుద్ది గురించి కృష్ణ కుటుంబ సభ్యులకు చెప్పాలని మావాళ్లు చెప్పారని , కానీ నేను మాత్రం నరేష్ మరింత చులకన అవుతాడని గ్రహించి చెప్పలేదని , చెప్పి ఉంటే బాగుండేదని అంటోంది రమ్య రఘుపతి.
సీనియర్ నటుడు నరేష్ ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకోగా రమ్య రఘుపతి మూడో భార్య. అయితే నరేష్ కు విడాకులు ఇవ్వలేదు. గతకొంత కాలంగా విడాకులు కావాలని నరేష్ రమ్యను కోరుతున్నాడు. కానీ రమ్య మాత్రం విడాకులు ఇవ్వడం లేదు. దాంతో ఆమె విడాకులు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పవిత్ర లోకేష్ తో కొంత హంగామా చేసాడు నరేష్.
ఇక ఇటీవల పవిత్ర లోకేష్ కు లిప్ లాక్ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసాడు నరేష్. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముసలోళ్ళకు దసరా పండగ ఏంట్రా ? బాబూ ! అని అనుకున్నారు అంతా. ఇక ఈ వీడీయోను చూసిన నరేష్ మూడో భార్య రమ్య నరేష్ కు విడాకులు ఇవ్వనని, వాళ్ళ పెళ్లి కానివ్వను అంటూ సవాల్ చేసింది. నరేష్ పోర్న్ వీడియోలు చూసేవాడిని , అలాగే ఇంట్లోనే అమ్మాయిలతో శృంగారంలో పాల్గొనేవాడని ….. ఇదేంటని అడిగితే నాకాళ్ళు పట్టుకునే వాడని తీవ్ర ఆరోపణలు చేసింది రమ్య రఘుపతి.