
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి చిత్రం 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. జనవరి 12 న భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. బాలయ్య కెరీర్ లోనే నెంబర్ వన్ గా నిలిచింది వీరసింహారెడ్డి. అయితే జనవరి 13 న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కావడంతో బాలయ్య జోరుకు బ్రేక్ పడింది. దాంతో రెండో రోజు, మూడో రోజు వసూళ్లు తగ్గాయి. అయినప్పటికీ బాలయ్య మాత్రం వెనక్కి తగ్గలేదు.
బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతూనే ఉన్నాడు. దాంతో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్లకు పైగా వసూళ్లను సాధించాడు. దాంతో త్వరలోనే 100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం ఖాయమని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. నైజాం లో బాలయ్యకు పెద్దగా ఓపెనింగ్స్ ఉండవు కానీ వీరసింహారెడ్డి చిత్రం మాత్రం అందుకు మినహాయింపు అనేలా వసూళ్లను రాబడుతోంది.