
good imaginations : భావోద్వేగాలు మనుషులకు సహజమే. దీంతో సుఖం కలిగినప్పుడు సంతోషపడటం, బాధ కలిగినప్పుడు ఏడవడం కామనే. బాధలు వచ్చినప్పుడు మన సంతోషకరమైన సంఘటనలు గుర్తు చేసుకుంటే బాధలు దూరమవుతాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అవకాశం చిక్కినప్పుడు మనం బాధల గురించి కాకుండా సంతోషకరమైన సంఘటనల గురించి ఆలోచిస్తే మనకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
గతంలో జరిగిన దుర్ఘటనలను ఆలోచించుకుంటే మనసు భావోద్వేగానికి గురవుతుంది. భావోద్వేగాలకు లోనయినప్పుడు శరీరాన్ని నియంత్రించుకోవడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మనకు అనుకూల ప్రభావాలు కలగడానికి ప్రతికూల ప్రభావాలతో మొదలు పెడితే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అప్పుడప్పుడు మనసు అదోరకంగా బాధలకు గురయితే శరీరంలో జరిగే మార్పుల వల్ల కూడా మన హార్మోన్లు స్పందిస్తాయి.
రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచాలంటే మనకు స్పందనలు రావాలి. అవి అనుకూలమైనా ప్రతికూలమైనా స్పందించే తత్వం ఉండాలి. అప్పుడే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. రాగద్వేషాలతో నిండిన మనసు రకరకాల స్పందనలను కలిగి ఉంటుంది. దీంతో అవయవాలు బాగా పనిచేసేందుకు దోహదపడతాయి.
ఇలా మన ఆరోగ్యానికి భావోద్వేగాలు కూడా సహకరిస్తాయి. మనసు పడే వేదన కూడా మనకు ప్లస్ అవుతుంది. మన ఆరోగ్య రక్షణలో ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయి. దీంతో మనం మన మనసును కూడా ఊరికే ఉంచుకోకుండా కొన్ని రకాల చర్యలతో స్పందించేలా చేయడం కూడా మనకు మంచిదే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.