
60 ఏళ్ల ఆచారాన్ని పాతర పెట్టింది ఆస్కార్. గత 60 ఏళ్లుగా రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతూ ఉండేది. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై గర్వంగా అడుగులు వేయాలని తహతహలాడేవాళ్లు నటీనటులు , సాంకేతిక నిపుణులు. అయితే ఇన్నాళ్ళుగా సాగుతున్న రెడ్ కార్పెట్ ఆచారాన్ని ఈసారి మాత్రం పాతరపెట్టింది ఆస్కార్. రెడ్ కార్పెట్ కు బదులుగా షాంపైన్ కలర్ కార్పెట్ ఏర్పాటు చేసారు నిర్వాహకులు. ఇలా ఎందుకు చేసారో ఎవరికీ అర్ధం కావడం లేదు.
దాంతో ఆస్కార్ రెడ్ కార్పెట్ అంశం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. రెడ్ కార్పెట్ బదులుగా షాంపైన్ కలర్ ను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆస్కార్ నిర్వాహకులు వివరణ ఇవ్వలేదు. అయితే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ కిమ్మెల్ స్పందించాడు.
గత ఏడాది జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో అనూహ్య సంఘటన జరిగిన విషయం తెలిసిందే. విల్ స్మిత్ క్రిస్ రాక్ వ్యవహరించిన తీరును తప్పు పడుతూ లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. బహుశా ఆ సంఘటనతో ఆస్కార్ వేడుక మరింతగా ఎరుపెక్కిందని భావించారేమో అందుకే ఈసారి రెడ్ కార్పెట్ కు బదులుగా షాంపైన్ కలర్ ను కార్పెట్ గా మలిచారని వ్యాఖ్యానించాడు. అయితే ఆస్కార్ నిర్వాహకులు మాత్రం రెడ్ కార్పెట్ స్థానంలో షాంపైన్ కలర్ ను ఎందుకు ప్రిఫర్ చేసారని వెల్లడించలేదు దాంతో స్పెక్యులేషన్స్ పెరిగిపోయాయి.